రాజ్యాంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు జాతీయస్థాయిలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శలకు, ప్రతివిమర్శలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దుమ్మెత్తుకుపోసుకుంటున్నాయి. తాజాగా ఏపీ మంత్రి కూడా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ అవిష్కరణలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎం కేసీఆర్ ను విమర్శించారు. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు. .. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్లను అంతలా కలిచివేసిందో అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆదిమూలపు సురేష్ అన్నారు.
సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో కూడా విమర్శలు వచ్చాయి. తెలంగాణ బీజేపీ నేతలు సీఎం వ్యాఖ్యలపై నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో బీజేపీ భీమ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.