పిసిసి చీఫ్ రేవంత్ ను కలిసిన డిసిసి అధ్యక్షులు

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

టిపిసిసి చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిధిలో చేపడుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమ వివరాలను టీపీసీసీ చీఫ్ కు వివరించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి ఆయనకు సూచించినట్లు తెలిపారు.