తీహార్ జైల్ లో కోవిడ్ కలకలం… వరసగా మహమ్మారి బారిన పడుతున్న ఖైదీలు

-

కోవిడ్ క్రమంగా దేశంలో విస్తరిస్తోంది. ఇండియాలో కూడా రోజుకు లక్షకు పైగా కేసులు వస్తున్నాయి. వరసగా రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ తీహార్ జైల్ లో కోవిడ్ ప్రకంపనలు కలిగిస్తోంది. తీహార్ తో పాటు ఢిల్లీలోని అన్ని జైళ్లలో కేసుల సంఖ్య పెరిగింది. వరసగా ఖైదీలు, జైలు సిబ్బంది వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు.

ఢిల్లీ జైళ్లలో ఇప్పటివరకు 66 మంది ఖైదీలు, 48 మంది జైలు సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది.
తీహార్ జైలులో 42 మంది ఖైదీలు, 34 మంది జైలు సిబ్బంది, మండోలి జైలులో 24 మంది ఖైదీలు, 8 మంది జైలు సిబ్బంది, రోహిణి జైలులోని 6 మంది జైలు సిబ్బందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలిందని జైలు అధికారులు తెలిపారు.

దేశంలో మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే.. దేశంలో 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గతంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 10 వేల లోపే ఉండేది. ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య రోజుకు లక్షకు పైగా నమోదవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news