గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ధరూర్ మండల పరిధిలోని నగాసమందర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండారి నర్సప్ప శుక్రవారం ఉదయం హఠాత్తుగా కింద పడడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో మరణించారు.