రంగారెడ్డి : యాచారం మండలంలో చిరుత కలకలం

యాచారం మండలంలోని పిల్లిపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతుంది. గ్రామ శివారులోని పొలంలో రైతు యెరుకలి బిక్షపతి గౌడ్.. ఆవు దూడను కట్టేశాడు. తెల్లారి చూస్తే.. అది చనిపోయి ఉందన్నాడు. చిరుత పులి చంపి తిని ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.