స్కూళ్ళు తెరవడానికి… కరోనా మహమ్మారి వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో కరోనా కేసులు వస్తే తాము శానిటైజర్ చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఆన్లైన్ క్లాస్ లో ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాదని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలికలు అనవసరమని ప్రతిపక్షాలకు చురకలంటించారు.
విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టీచర్లకు 100% అలాగే విద్యార్థులకు 90% వ్యాక్సినేషన్ పూర్తి అయిందని ఆయన ప్రకటన చేశారు. మరి అవసరం అయితే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. యధావిధిగా పాఠశాలలు మరియు కాలేజీలు… పున : ప్రారంభం కానున్నాయని తెలిపారు.విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తర్వాత విషయంలో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పిల్లల ఆరోగ్యంపై తమకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రద్ధ ఉంటుందన్నారు.