రంగారెడ్డి : రెచ్చిపోతున్న గొలుసు దొంగలు

Nellore chain snatching case
chain snatching case

ఎల్‌బీనగర్లో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. శివగంగ కాలనీకి చెందిన సునీతారెడ్డి (53) గురువారం సాయంత్రం జైపురికాలనీ నుంచి తన ఇంటికి బయలుదేరి ఎల్‌బీనగర్ డీసీసీ కార్యాలయం ఎదురు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు సునీతారెడ్డి మెడలో ఉన్న 3.5 తులాల బంగారం గొలుసును తెంచుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.