రంగారెడ్డి : ఓటు కోసం తెలంగాణ నుంచి ఒడిశాకు..

మూసాపేటలో నివాసం ఉండే ఒడిశా వలస కూలీలు ఒడిశాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు తరలి వెళ్లారు. ఒడిశాలోని బుస్కిడి, కోరస్సండ, జాజుపూర్‌ గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు ప్రైవేట్‌ బస్సుల్లో తరలి వెళుతున్నారు. ఒడిశా నుంచి వలస వచ్చి మూసాపేట పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ కంపెనీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నారు. అక్కడి నాయకులు బస్సులు ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నారు.