సికింద్రాబాద్ క్లబ్ ఆదివారం ఉదయం తెల్లవారుజామున కాలి బూడిదైన విషయం తెలిసిందే. అయితే 1878లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్లబ్లో.. 5 వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. క్లబ్లో 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. సికింద్రాబాద్ క్లబ్‌ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి.. 2017లో పోస్టల్ కవర్ విడుదల చేశారు.