
చంపాపేట్‌లో బీజేపీ హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరై మాట్లాడుతూ.. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తామన్నారు. హైదరాబాద్ పార్లమెంట్‌ను గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు. ‘తెలంగాణ కాషాయ అడ్డ’ అని అన్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.