దొంగల బీభత్సం.. ఆభరణాలు మాయం

దుండిగల్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన గడ్డ సిరాజ్ ఇంట్లో ఈ నెల 9వ తేదీ రాత్రి దొంగలు పడి ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. సోమవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.