ఇండియన్ ప్రిమియర్ లీగ్-2022 టైటిల్ స్పాన్సర్‌గా దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ వ్యవహరించనున్నట్లు సమాచారం. టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న చైనీస్ మొబైల్ ఉత్పత్తిదారు వివో వ్యవహరించిన విషయం తెలిసిందే. వివో స్థానంలో టాటా గ్రూప్ ఐపీఎల్-2022 టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అవును, ఐపీఎల్ -2022 టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చిందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ధ్రువీకరించారు.
ఇండియన్ ప్రిమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను 2018-2022 కాలానికి వివో సొంతం చేసుకున్నది. ఇందుకోసం బీసీసీఐకి రూ.2200కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది. అయితే, గత ఏడాది గల్వాన్ వ్యాలీ భారత్, చైనా సైన్యం మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశంలో చైనీస్ కంపెనీ వివోపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఐపీఎల్-2020కు వివో స్థానంలో డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.