
టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ఆయనకు గట్టమ్మ దేవాలయం వద్ద ఘనంగా స్వాగతం పలకాలని ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు నల్లల కుమారస్వామి పిలుపునిచ్చారు. జిల్లా పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.