హన్మకొండ బాలసముద్రంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బాలసముద్రంలోని లేబర్ ఆఫీస్ పక్కన వేగంగా వచ్చిన జీపు అదుపుతప్పి ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జీపు నడుపుతున్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు.