![Good news for st students](https://cdn.manalokam.com/wp-content/uploads/2021/08/images-2021-08-17T072811.294.jpeg)
ధర్మారం మండలం నంది మేడారం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజన సమయంలో కలుషిత నీరు తాగి 38 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు చేసుకోగా మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. 12 మందిని మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి ఈశ్వర్ డీఈవో మాధవితో ఫోన్ లో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.