సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధిపై శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా నిధులు, అన్ని వార్డుల కౌన్సిలర్లకు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు నిధుల విషయంలో అవకతవకలు జరిగితే సహించేది లేదన్నారు. మున్సిపాలిటీలో నీటి సమస్య లేకుండా చూడాలన్నారు.