వారం వ్యవధిలో 500 మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా

-

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయి 10 రోజుకు చేరుకుంది. అయితే ఉక్రెయిన్ ను ఎలాగైనా లొంగదీసుకోవాలని.. రష్యా శత విధాల ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా జెలెన్ స్కీని గద్దె దింపి… తనకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా అనేక రకాల బాంబులతో విరుచుకుపడుతోంది. అత్యంత భయంకరమైన క్లస్టర్, వ్యాక్యూమ్ బాంబులతో ఉక్రెయిన్ పై దాడి చేస్తోంది.

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభం అయిన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే రష్యా 500 మిస్సైళ్లను ప్రయోగించింది. రోజుకు రెండు డజన్ల రకరకాల మిసైళ్లను వాడుతూ.. ఉక్రెయిన్ పై దాడి చేస్తోంది. ఈ విషయాన్ని పెంగటాన్ లోని ఓ అధికారి తెలిపారు.

రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఒడిస్సా, మరియోపోల్, కీవ్, ఖర్కీవ్, సుమీ ఇలా అన్ని నగరాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే నాటో, అమెరికా సహకారంతో ఉక్రెయిన్ బలగాలు రష్యన్ ఆర్మీపై ప్రతిదాడి చేస్తున్నాయి. పుతిన్ వ్యూహాలకు అసలు తలొగ్గడం లేదు ఉక్రెయిన్ సేనుల.

Read more RELATED
Recommended to you

Latest news