వికారాబాద్: హరితహారం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు నర్సరీలలో అన్ని రకాల మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం నవాబుపేట మండలంలోని చించల్పేట హరితహారం నర్సరీని, వైకుంఠ దామాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సరీలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శి అనంతరాజ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, గ్రామ సర్పంచ్ కు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.