వరంగల్ ఎంజీఎం జంక్షన్, పోచం మైదాన్ జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు నెంబర్ ప్లేట్స్ బిగించి పంపించారు. వాహనదారులు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లను వారి వారి వాహనాలకు ఫిక్స్ చేసుకోవాలన్నారు. లేని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.