కాశ్మీర్ వివాదం…. హ్యుందాయ్, కియా, కేఎఫ్సీ, ఫిజ్జా హట్ పై లాయర్ ఫిర్యాదు

-

పాకిస్థాన్ కు అనుకూలంగా.. ఆ దేశం నిర్వహిస్తున్న ‘కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం’ రోజున పలు ఎంఎన్సీ కంపెనీలు పోస్ట్ లు పెట్టడం వివాదాస్పదం అయింది. హ్యుందాయ్, కియా, కేఎఫ్సీ, పిజ్జా హట్ వంటి కంపెనీలు పాకిస్తాన్ కు మద్దుతుగా పోస్టులు పెట్టాయి. దీంతో ఇండియా తీవ్రంగా స్పందిస్తోంది. కాశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో అంతర్భాగమే అంటూ.. ‘షేమ్ అన్ యూ’ హ్యాష్ ట్యాగ్ తో నెటిజెన్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తోంది.

ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ హ్యుందాయ్, కియా, కేఎఫ్సీ, పిజ్జా హట్ లపై కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ఢిల్లీ పోలీసుకు ఫిర్యాదు చేశారు. భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా వ్యవహరించినందుకు ఆ సంస్థల లైసెన్స్ లను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజెన్లు గట్టిగా నిరసన తెలుపుతున్నారు. ఆయా కంపెనీలు ఇండియాలో చేసే బిజినెస్, పాకిస్తాన్ లో చేసిన బిజినెస్ అంతరాన్ని చూపిస్తూ.. పోస్టులు పెడుతున్నారు. దీంతో దిగివచ్చిన సదరు కంపెనీలు దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ కు మద్దతుగా పెట్టిన పోస్టులను డిలీట్ చేసింది. అంతే కాకుండా తాము భారతదేశ సార్వబౌమాధికారాన్ని గౌరవిస్తామంటున్నాయి. అయితే రానున్న కాలంలో ఈ కంపెనీల అమ్మకాలపై తప్పకుండా ఈ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news