
జనగాం జిల్లా వ్యాప్తంగా సోమవారం బూస్టర్ డోస్ టీకా కార్యక్రమం ప్రారంబించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రితో పాటు అన్ని పీహెచ్సీలలో వృద్ధులు, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు మొత్తం 785 మందికి టీకాలు వేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. అదేవిదంగా 18 ఏళ్ల లోపు వారికి టీకా కార్యక్రమం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.