వరంగల్ : ములుగు: ‘గాలిపటం కోసం స్తంభం ఎక్కిన బాలుడు.. పరిస్థితి విషమం’

గాలిపటం కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కిన పన్నెండేళ్ల బాలుడికి తీవ్రగాయాల అయ్యాయి. ఈ ఘటన శనివారం ములుగులో చోటుచేసుకుంది. పతంగి చిక్కుకుపోవడంతో బాలుడు విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. గాలిపటం తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరెంటు సరఫరా నిలిపేసిన లైన్‌మెన్‌ బాలుడిని కిందికి దింపారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.