వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో అగ్నిప్రమాదం

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఉన్న గోదాం వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు. భారీ నష్టం తప్పిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.