భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమల్ దంపతులు ఈరోజు సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రధాన రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మద్య చైర్మన్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించి, చిత్రపటాన్ని అందజేశారు.