ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడటం ఖాయం… యూపీలో ప్రజలు అఖిలేష్ వైపే ఉన్నారు.- కడియం శ్రీహరి

-

కుల మతాలను రెచ్చగొట్టే పార్టీ బీజేపీ అని మీరు దళితులు, మైనారిటీలు, ఆదివాసీలకు, ఓబీసీలకు ఏం చేశారని ప్రజలు ఓటేయాలని ప్రశ్నించారు ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు.  ఉత్తర్ ప్రదేశ్ లో గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు అఖిలేష్ యాదవ్ వైపే ఉన్నారని అన్నారు. బీజేపీ విధానాల వల్ల బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు ఆపార్టీకి దూరం అవుతున్నారని విమర్శించారు. ఇక పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలో ఉందన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కలలు కంటోంది. మీ కోరికలు కలలుగానే మిగులుతాయని కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నా.. గిరిజన జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు కనీసం జాతీయ హోదా, జాతీయ పండగగా గుర్తించలేదన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ.. రాష్ట్ర శాసనసభ తీర్మాణం చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని, గిరిజన యూనివర్సిటీకి దిక్కు లేదని ఆయన బీజేపీని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా కల్పించలేదని కడియం విమర్శించారు. బండి సంజయ్ పోడు భూములపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని… అటవీ చట్టం కేంద్రం చేతుల్లో ఉందని.. అలాంటప్పడు బండి సంజయ్ ఇక్కడ ఆందోళన చేయడం కాదు.. ప్రధాని ఇంటి ముందు ఆందోళన చేయాలని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news