వరంగల్ : సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే

జనగామ: మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి తపాస్ పల్లి రిజర్వాయర్ కు పైప్లైన్ ద్వారా నీరందించేందుకు రూ.388 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను బుధవారం ప్రగతి భవన్ లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలిసి నియోజకవర్గం రైతుల పక్షాన పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పైప్లైన్ నిర్మాణం పూర్తైతే మొత్తం జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు.