రైలు నుండి జారీ పడి వ్యక్తి మృతి

crime

తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన శివరాత్రి మురళి స్వామిమాల ధరించి, శబరిమలై వెళ్లాడు. మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణంలో తోటియపాళ్యం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కిందపడి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.