దేశంలోని రైతులు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు : మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

దేశంలోని రైతులు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతును ఇంత గోస పెడతారా…? అని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. పండగ పూట ఎరువుల ధరలు 50% నుండి 100% కు పెంచుతారా ? అని కేంద్ర ప్రభుత్వం నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దుర్మార్గపు చర్యలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర బిజేపి పార్టీ నాయకులు పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని తమ కేంద్ర నాయకత్వాన్ని డిమాండ్ చేయాలని ఫైర్ అయ్యారు. రైతుల ప్రయోజనం కోసం కేంద్రంలోని బిజెపి చేసింది శూన్యమని.. ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిందేనని డిమాండ్ చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశ రైతాంగం KCR కోసం ఎదురుచూస్తున్నదని..బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర రైతన్నలు ఆలోచన చేయాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news