నెక్కొండలో రోడ్డు ప్రమాదం

accident

వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేశసముద్రం నుంచి నెక్కొండ వెళ్తున్న కారు, తోపనపల్లి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటరిస్టు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన వాళ్లని ఆసుపత్రికి తరలించారు. మృతుడు నెక్కొండ మండలం వల్లికొండకు చెందిన ఫయాజ్‌గా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.