బంతి సాగు విషయంలో తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..!

-

బంతి పూలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంటిని అలంకరించుకోవడానికి, పూజ గదిని అలంకరించుకోవడానికి ఎక్కువగా వాడతారు. పండగల్లో అయితే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల రంగులలో ఇవి మనకి అందుబాటులో ఉంటాయి. అయితే బంతి పూల మొక్కలని పెంచే విధానం గురించి, బంతి సాగు లో మెళకువలు గురించి ఈరోజు మనం చూద్దాం.

marigold
marigold

బంతి అన్ని నెలల్లోను సాగు చేసినప్పటికీ సారవంతమైన గరప నేలలు వీటికి బాగా అనుకూలమని చెప్పొచ్చు. అటువంటి నేలని ఎంచుకోండి అప్పుడే బాగా పూలు వస్తాయి. అలానే మొక్కలు కూడా బతుకుతాయి. అదే విధంగా బంతిని వాతావరణ పరిస్థితులని బట్టి ఏడాది పొడువును సాగుచేయవచ్చు. ఎప్పుడు కూడా వీటిని సాగు చేసేటప్పుడు .

10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే తక్కువ లేదా 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువున్నా ఇబ్బంది అని గ్రహించండి. నీడ ప్రదేశాల లో వీటిని పెంచితే మంచిది. ఫ్రికన్ మరియు ఫ్రెంచి రకాలు బాగుంటాయి. వాటిని ప్రిఫర్ చేస్తే మంచిది. జూలై మొదటి వారం నుండి ఫిబవరి మొదటి వారం వరకు నాటుకుంటే మంచిది. అప్పుడు మీరు సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు పూలు సరఫరం చేయవచ్చు.

ఇక ఎరువుల విషయానికి వస్తే.. ఎకరానికి 8-10 టసుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 30-40 కిలోల నత్రజని , 80 కేజీల భాస్వరం మరియు 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువు వేసి దున్నాలి. మొక్కలు నాటుకొన్న 30 రోజుల తర్వాత మరో 40 కిలోల నత్రజనిచ్చే ఎరువులను పై పాటంగా వేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news