ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా పనిచేసిన ప్రస్తుత జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కేంద్రానికి చెందిన చింతకుంట్ల సురేందర్ రెడ్డి గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన పలు హోదాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు, అలాగే తెలుగుదేశం పార్టీలో వివిధ పదవుల్లో పార్టీకి సేవలందించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు వరంగల్ జిల్లా నాయకులు సంతాపం తెలిపారు.