చిన్న జీయర్ స్వామిపై సీతక్క ఆగ్రహం

చిన్న జీయర్ స్వామి తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు అహంకారపూరిత మాటలు చేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.

సమ్మక్క సారలమ్మ తల్లులది వ్యాపారమా అని ప్రశ్నించారు. దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని స్పష్టం చేశారు. ” మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతామూర్తి విగ్రహం చూడ్డానికి 150 రూపాయలు టికెట్ ధర పెట్టి బిజినెస్ చేస్తున్నారని” ఆరోపించారు.