మహబూబాబాద్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన బోయిని యాకయ్యకు కొన్నేళ్ళ క్రితం వివాహం కాగా ఆయన భార్య కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో వారి ఇద్దరిపిల్లలు తాత(మృతురాలి తండ్రి) వద్ద ఉంటున్నారు. తన పిల్లల్ని తనకు ఇవ్వాలని యాకయ్య మామను కోరగా నిరాకరించాడు. దీంతో కక్ష పెంచుకున్న యాకయ్య గత నెల 25న మామను హత్య చేశాడు. పోలీసులు ఈ రోజు హంతకుడుని పట్టుకొని మీడియా ముందు హాజరుపరిచారు.