రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రజల్లో ధైర్యాన్ని నింపింది.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి నిరంకుశ పాలన ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందని..అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ఏపీలోని మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దులపై హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని.. ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. 6 నెలల్లో ఒప్పంద ప్రకారమే అభివృద్ధి చేయాలని పేర్కొంది. అక్కడి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని హైకోర్ట్ ఆదేశించింది. పిటీషనర్లందరికీ ఖర్చుల కింద రూ. 50వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు తీర్పును అమరావతి ఉద్యమకారులతో పాటు.. ప్రతిపక్షం టీడీపీ స్వాగతించింది. హైకోర్ట్ తీర్పు సీఎ్ం జగన్ కు చెంపపెట్టుగా టీడీపీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. కోర్టు తీర్పును టీడీపీ స్వాగతించింది.