పోలీస్ కమిషనర్‌ను కలిసిన ట్రైని ఐపీఎస్

ఇటీవల ఐపిఎస్ శిక్షణ పూర్తి చేసుకోని క్షేత్ర స్థాయిలో శిక్షణ పొందేందుకు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం చేరుకున్న ట్రైనీ ఐపిఎస్ పరితోష్ పంకజ్ వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పూలమొక్కను అందజేసారు. శిక్షణలో భాగంగా ఆయన ఇక్కడ ఆరు నెలలు ఉండనున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ కమీషనర్ నుంచి పలు సూచనలు తీసుకున్నారు.