వరంగల్ నగరంలోని ఫోర్ట్ వరంగల్ అగర్త చెరువులో చేపల వేటకు వెళ్లిన కిషోర్‌కు చాలా అరుదైన చేప వలలో చిక్కింది. బంగ్లాదేశ్‌లో ఎక్కువగా ఉండే క్యాట్ ఫిష్ సంతతికి చెందిన ఈ చేపను, దెయ్యం(డెవిల్), సక్కేర్ చేప, విమానం చేప అని పిలుస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ రకం చేపలు తినడానికి ఉపయోగపడవని తెలిపారు. ఈ వింత చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.