రాజాసింగ్ ను ఉద్దేశించి బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ లాంటి నేతకు సాటి ఎవరూ లేరు అంటూ కితాబు ఇచ్చారు బండి సంజయ్. హిందూ ధర్మానికి ఆదర్శమైన వ్యక్తి రాజాసింగ్ అంటూ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్. తాజాగా మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి
పైన కూడా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి త్వరలోనే భర్తీ చేస్తారని ఆయన
వెల్లడించారు.
ఈ విషయం కేంద్ర బీజేపీ పార్టీ చేతిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్ష విషయం
మొత్తం జేపీ నడ్డా చేతిలో ఉంటుందని వివరించారు. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి విషయంలో బయట చాలా ప్రచారం జరుగుతోందని.. కానీ అందులో వాస్తవం ఏమాత్రం లేదన్నారు. బిజెపి పార్టీలో అధ్యక్ష పదవికి అందరూ అర్హులేనని వివరించారు. ఎవరి వల్ల పార్టీకి లబ్ధి జరిగితే.. వాళ్లను అధ్యక్షుడిని చేస్తారని చెప్పుకొచ్చారు బండి సంజయ్ కుమార్. నా టర్మ్ అయిపోయింది. కొత్త అధ్యక్షుడు వస్తాడని అన్నామలై కూడా చెప్పారని గుర్తు చేశారు. బిజెపి త్వరలోనే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందన్నారు.