చిత్ర పరిశ్రమలో మరో విషాదం..క్యాన్సర్‌ తో హాలీవుడ్ నటుడు మృతి

-

చలన చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం.

హాలీవుడ్‌ చిత్రాల హీరో, వెటరన్‌ యాక్టర్‌, ఆస్కార్‌ పురస్కార గ్రహీత విలియమ్‌ హర్ట్‌ ఆదివారం మరనించారు. మరో వారం రోజుల్లో 72 ఏళ్లు నిండుతాయనగా… విధి ఆయన జీవితానికి ముగింపు పలికింది.

ద బిగ్‌ చిల్‌, ఏ హిస్టరీ ఆఫ్‌ వయలెన్స్‌ సినిమాలతో.. విలియమ్‌ హర్ట్‌ ఎంతో మందికి పరిచయస్తులు. 2018 మే నెలలో ఆయనకు ప్రొస్టేట్‌ కేన్సర్‌ బయటపడింది. అయితే.. అప్పటి నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతోనే… బాధపడుతున్నారు. ఇక తాజాగా ఆయన మృతి చెందారు. అయితే.. ఆయన క్యాన్స్‌ ర్‌ తో నే మృతి చెందారా ? లేక ?ఇతర సమస్యలతో మరణించారా అని తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news