‘షా’ కే షాక్ ఇచ్చే వ్యూహాలతో కేసీఆర్ సిద్దం…!!!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, క్రమ క్రమంగా తన ఉనికిని తనది కాని రాష్ట్రాలలో సైతం చాటాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేసుకుంది. ఈ మేరకు తనకి అనుకూలంగా ఉండే ప్రతీ అంశంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలో ఎక్కడైనా చిన్నపాటి అసంతృప్తి కలిగినా వెంటనే ఆ విషయాన్ని బూతద్దంలో చూపిస్తోంది. తెలంగాణా ప్రజల ముందుకు కేసీఆర్ ని బూచి చేసి చూపించాలనే ఆలోచనతో సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది బీజేపీ..

cm kcr plan for amit shah

వచ్చే ఎన్నికల్లో అంటే 2024 లో తెలంగాణా రాష్ట్రంలో తన జెండా పాతాలని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగానే కిషన్ రెడ్డి కి కేంద్ర సహాయ మంత్రి పదవి కట్టబెట్టిందనేది ఓపెన్ సీక్రెట్. కిషన్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణా వ్యాప్తంగా బీజేపీ ని మరింత బలపరచవచ్చునని అంచనా వేసిన బీజేపీ అధిష్టానం. కిషన్ రెడ్డి తెలంగాణలో తీసుకునే నిర్ణయాలకి పూర్తి స్వేఛ్చనిచ్చిందట. బీజేపీ కి సుదీర్ఘకాలం కార్యకర్తగా మాత్రమే కాదు భక్తుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటికే తెలంగాణా వ్యాప్తంగా బీజేపీ ని బలపరిచే పనిలో పడ్డారని తెలుస్తోంది..

ఈ క్రమంలోనే అమిత్ షా సైతం తెలంగాణా విషయంలో ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారట. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు టీఆర్ఎస్ లో ఉన్న అసంత్రుప్తులని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అన్నీ నిశితంగా గమనిస్తున్న కేసీఆర్ బీజేపీ తీసుకునే నిర్ణయాలకి, భవిష్యత్తు వ్యుహలకి చెక్ పెట్టడానికి సిద్దమవుతున్నారట.

తెలంగాణా రాష్ట్ర సాధన విషయంలోనే కేసీఆర్ వ్యవహరించిన తీరు, కేసీఆర్ రాజకీయ చతురత తెలియంది కాదు. కేసీఆర్ సరిగ్గా బీజేపీ పై దృష్టి పెడితే గత ఎన్నికల్లో వచ్చిన ఆ నాలుగు సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు రాజకీయ ఉద్దండులు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమిత్ షా కే షాక్ ఇచ్చేలా, మళ్ళీ 2024 లో తిరిగి అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ఇప్పటికే ఓ భారీ వ్యూహాన్ని సిద్దంచేశారాని అది అమలు చేస్తే తప్పకుండా తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆ భారీ వ్యూహం ఏమిటో తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు ఆగాల్సిందేనట..