ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పనున్న జగన్..?

-

ఢిల్లీ టూర్‌లో జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాలను కలిసి ఏపీ సమస్యలపై నివేదికలు ఇవ్వనున్నారని సమాచారం. దీంతోపాటు ఏపీలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను జగన్ ప్రధాని, మంత్రులకు వివరిస్తారట.

ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషించారు. జగన్ సీఎం అయి తమ కష్టాలను తీరుస్తారని వారు నమ్మారు. కనుకనే ఆయన్ను సీఎంగా గెలిపించుకున్నారు. అయితే ప్రజలు అనుకున్నట్లుగానే ఏపీలో జగన్ పాలనలో తనదైన ముద్రను వేశారు. ప్రస్తుతం ఏపీలో జగన్ పాలన సరిగ్గానే ఉందని చాలా మంది కితాబిస్తున్నారు. అయితే పచ్చ మీడియా అడపా దడపా సెటైర్లు వేస్తున్నా జగన్ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.

cm ys jagan to tell good news to ap people

టీడీపీ కన్నా వైసీపీ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని పలువురు చెబుతున్నారు. అలాగే జగన్ పాలనను గాడిలో పెట్టారని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పందన క్యాక్రమానికి జనం నుంచి విశేషరీతిలో రెస్పాన్స్ వచ్చింది. దీన్ని వైసీపీ ప్రభుత్వ విజయంగానే చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తమకు ఏదో చేస్తున్న నమ్మకంతోనే చాలా మంది దరఖాస్తుదారులు అధికారుల వద్దకు రాగా అధికారులు కూడా జనాలను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారట. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పాజిటివ్‌గానే ఉన్నారట.

అయితే రాష్ట్రంలో పాలనా పరంగా వచ్చే సమస్యలను జగన్ గాడిలో పెడుతున్నా.. కేంద్రం నుంచి రావాల్సిన సహాయం అందడంలో ఆలస్యమవుతోంది. దీంతో జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవాలని నిశ్చయించారు. అందులో భాగంగానే జగన్ మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీలో ప్రధానితోపాటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలిసింది. కాగా సీఎం అయ్యాక జగన్ టూర్ చేపట్టడం ఇది రెండోసారి.

ఇక ఢిల్లీ టూర్‌లో జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాలను కలిసి ఏపీ సమస్యలపై నివేదికలు ఇవ్వనున్నారని సమాచారం. దీంతోపాటు ఏపీలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను జగన్ ప్రధాని, మంత్రులకు వివరిస్తారట. ఇక విద్యుత్ ఒప్పందాలపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో వాటిపై రివ్యూ ఎందుకు అన్న విషయాలపై కూడా మోదీకి జగన్ స్పష్టతనివ్వనున్నారట. అలాగే పోలవరం రీ టెండరింగ్‌పైనా మోదీకి జగన్ వివరణ ఇస్తారని తెలిసింది. అయితే వీటితోపాటు విభజన చట్టంలో ఉన్న అంశాల మేరకు ఏపీకి రావల్సిన నిధుల గురించి, ఇతర సమస్యల గురించి కూడా జగన్ మోదీతో చర్చిస్తారని సమాచారం.

ప్రస్తుతం ఏపీ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నందున ఆ దిశగా జగన్ కేంద్రాన్ని సాయం కోరుతారని తెలిసింది. ఏపీని ఆదుకోవాలని జగన్ మోదీని కోరుతారని తెలిసింది. అలాగే తమకు రాజకీయపరంగా మోదీతో ఎలాంటి విభేదాలు లేవనే విషయాన్ని కూడా జగన్ పరోక్షంగా మోదీకి తెలియజేయాలని చూస్తున్నారట. ఇప్పటికే ఆర్టికల్ 370, కాశ్మీర్ విభజన బిల్లుపై వైసీపీ బీజేపీ సర్కారుకు మద్దతు ఇచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బేషరతుగా ఆయా అంశాలకు సభలో మద్దతు ప్రకటించారు. దీంతో వైసీపీపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మోదీ ఏపీకి సాయం అందించాలని జగన్ కోరనున్నారట. అయితే జగన్ రెండు రోజుల ఢిల్లీ టూర్ నేపథ్యంలో కొత్తగా ఏపీకి ఏం వరాలు తెస్తారనే ఉత్కంఠ ఆ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. మరి జగన్ ఏపీ ప్రజలకు కొత్తగా చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏమిటన్నది తెలియాలంటే రెండు రోజుల వరకు వేచి చూడక తప్పదు..!

Read more RELATED
Recommended to you

Latest news