చక్రం తిప్పిన జిల్లాలోనే టిడిపి చచ్చిపోయిందా…?

-

అనంతపురం జిల్లా… ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో ఉన్న బలం గురించి ఎంత చెప్పినా తక్కువే. పార్టీ నుంచి చాలామంది కీలక నేతలు ఈ జిల్లా నుంచి వచ్చారు. పరిటాల కుటుంబం నుంచి జేసీ కుటుంబం వరకు కూడా పార్టీకి ముందు నుంచి కూడా అండగా ఉన్న వాళ్లు కొందరున్నారు. జేసీ కుటుంబం తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సరే అంతకు ముందు చాలా మంది కీలక నేతలు ఇక్కడ చక్రం తిప్పారు. ప్రధానంగా పయ్యావుల కేశవ్, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అలాగే ప్రభాకర్ చౌదరి, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది తెలుగుదేశం పార్టీకి జిల్లా నుంచి అండగా నిలిచిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం జిల్లాలో ఆ పరిస్థితి కనపడటం లేదు.

తెలుగుదేశం పార్టీ కోసం నేనున్నాను అని ముందుకు వచ్చే నేతలు ఎవరూ కూడా జిల్లాలో కనపడటం లేదు. పరిటాల వర్గం కూడా దాదాపుగా నియోజకవర్గంలోనే సైలెంట్ గా ఉంది. ఇక జిల్లావ్యాప్తంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు. అంతే కాకుండా ప్రభాకర్ చౌదరి వంటి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుకు రావడం లేదు. అది పక్కనపెడితే రాష్ట్ర ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా ఉన్న పయ్యావుల కేశవ్ అయితే అసలు ఒక్క మాట కూడా మాట్లాడటానికి ఆసక్తి చూపించడం లేదు. ఆయన మీడియా ముందుకు వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఆయనకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉన్నాసరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి మాత్రం సాహసం చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేస్తున్న సరే ఆయన నుంచి రావడం లేదు. ఒక్క విమర్శ అంటే ఒక విమర్శ కూడా ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా ఉండి చేయలేకపోతున్నారు.

జేసీ కుటుంబం మాత్రం గట్టిగా మాట్లాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో జేసీ దివాకర్ రెడ్డి గాని పవన్ కుమార్ రెడ్డి గాని విమర్శలు చేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు సింగనమల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న బండారు శ్రావణి శ్రీ మీడియా ముందు కనబడుతున్నారు. వీరు మినహా జిల్లాలో పార్టీ కోసం మేము ఉన్నాం అని ముందుకు వచ్చే నేతలు ఎవరూ కూడా కనపడటం లేదని చెప్పాలి. ఒకప్పుడు పరిటాల రవీంద్ర ఉన్న సమయంలో పార్టీలో అన్నీ తామై వ్యవహరించిన వారు కూడా ఇప్పుడు అంటీ ముట్టనట్టు గా వ్యవహరిస్తున్నారు. ఒకపక్క వైసీపీ నేతలు దూకుడుగా వెళ్తున్న సరే… జిల్లాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి సాహసం చేయటం లేదు. ప్రతిరోజు 1000 కేసులకు పైగా జిల్లాలో నమోదవుతున్న సరే మీడియాతో మాట్లాడాలి అంటే భయపడుతున్నారు. మరి దానికి కారణం ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ అధినేత కే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news