ఎడిట్ నోట్ : కేసీఆర్ పై కుట్ర ! నిజ‌మేనా !

-

కేసీఆర్ పై కుట్ర ప‌న్నేందుకు  విప‌క్షాలు సిద్ధం అవుతున్నాయా ! అంటే అందుకు అవునన్న స‌మాధాన‌మే వ‌స్తోంది.అస‌లు నోటిఫికేష‌న్ ప్ర‌క్రియన్నది ఆయ‌న అనుకున్నంత సులువు కాద‌ని విప‌క్షాలు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.ఎప్ప‌టిలానే నోటికి వ‌చ్చిందంతా వాగుతున్నాయి. వీటిని పాల‌క ప‌క్షాలు తిప్పికొడుతున్నాయి.ఈ త‌రుణంలో మ‌రో న్యాయ పోరాటం తాము చేస్తామ‌ని కొన్ని రాజ‌కీయ పార్టీలు అంటున్నాయి.

వీటిని దాటుకుని వ‌స్తే కేసీఆర్ మంచి ఫ‌లితాలు సాధించ‌డం తథ్యం.విమ‌ర్శ‌లు అటుంచి ఆలోచిస్తే ఇవాళ ఆంధ్రాలోనూ కేసీఆర్ కు నీరాజ‌నాలు ప‌డుతున్నారు.ఒకప్పుడు ఆయ‌న పేరు చెబితేనే ఆగ్ర‌హంతో ఊగిపోయే నిరుద్యోగ యువ‌త ఇవాళ కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతోంది.ద‌టీజ్ కేసీఆర్.కానీ ఇంత‌టి క్రేజ్ ను నిల‌బెట్టుకోవ‌డంలోనే ఉంది సిస‌లు ప‌రీక్ష.ఇవాళ రేవంత్ కానీ ఈటెల కానీ సాధించేదేమీ లేదు కానీ అయినా కూడా కేసీఆర్ త‌న స‌త్తాకు తిరుగులేద‌ని మ‌రోమారు నిరూపించాల్సిన త‌రుణం రానే వ‌చ్చింది.

తెలంగాణ వాకిట భారీ ఉద్యోగాల నోటిఫికేష‌న్ ఒక‌టి విడుద‌ల చేశారు కేసీఆర్.దీంతో అంతా అక్క‌డ పండుగ చేసుకుంటున్నారు. తొంభై వేల‌కు పైగా ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ స‌ప్రైజ్ ఆఫ‌ర్ ఒక‌టి ప్ర‌క‌టించారు.ఈ నేప‌థ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ ప్ర‌క్రియ కూడా త్వ‌ర‌లోనే పూర్త‌యితే ప‌ద‌కొండు వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుతుంది.ఇదే సమ‌యంలో మిగ‌తా 80వేల‌కు పైగా పోస్టుల‌కు సంబంధించి జోన్ల వారీగా జిల్లాల వారీగా ఖాళీల భ‌ర్తీకి సిద్ధం అయితే కేసీఆర్ కు ఎన‌లేని పేరు రావ‌డం కూడా ఖాయం. దీనిని త‌ట్టుకోలేక అప్పుడే వైఎస్ఆర్ అమ్మాయి ష‌ర్మిల ఇదంతా నా క్రెడిటే అంటున్నారు. దాదాపు రెండు ల‌క్ష‌ల ఖాళీలు ఉంటే 90వేల‌కు పైగా ఖాళీలే ఎలా చూపిస్తార‌ని మండిప‌డుతున్నారు ఆమె.ఏమ‌యినప్ప‌టికీ తాను చేసిన దీక్ష‌ల ప్ర‌భావం తాజా నోటిఫికేష‌న్ల‌పై ఉంద‌ని ష‌ర్మిల డ‌ప్పు కొడుతున్నారు.

 

అవును! ఎవ‌రి డ‌ప్పు వారే కొట్టాలి.కాద‌నం కానీ మ‌రీ ఇంత డ‌ప్పు త‌గ‌ద‌మ్మో! ఇక తాజా ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి కోర్టుకు పోవాల‌ని యోచిస్తోంది విప‌క్షం. న్యాయ పోరాటం చేయాల‌ని ఇప్ప‌టిదాకా ఉన్న ఖాళీల లెక్క‌ల్లో ఉన్న మ‌త‌ల‌బు ఏంటో తేల్చాల‌ని అప్పుడే నోటిఫికేష‌న్ల  ర‌గ‌డ కు ఓ ప‌రిష్కారం ఉంటుంద‌ని భావిస్తోంది. కానీ తెలంగాణ రాష్ట్ర స‌మితి మాత్రం ఇవ‌న్నీకొట్టి పారేస్తుంది. తాము జీఓ నంబ‌ర్ 317 ద్వారా స్థానికత ప్ర‌కారం అదేవిధంగా జోన్ల ప్ర‌కారం లెక్క‌లు అన్నీ తేల్చామ‌ని ఇప్పుడు కొత్త‌గా మీరు న‌డిపే డ్రామాఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న. దీంతో ఈ వివాదం ఇప్ప‌ట్లో తేల‌దు. జోన్ల‌ను మూడు నుంచి ఏడుకు పెంచి ఖాళీల‌ను చూపించి భ‌ర్తీకి తాము కృషి చేస్తుంటే మీరేమో  ఈవిధంగా నోటికివ‌చ్చిన విధంగా మాట్లాడ‌డం త‌గ‌ద‌ని అంటోంది విప‌క్షం.

Read more RELATED
Recommended to you

Latest news