కోట్లు వచ్చినా మారని బతుకుచిత్రం.. కేబీసీ విజేత ఇలా అయ్యాడా..!

-

అదృష్టం ఒకసారే తలుపుతడుతుంది..కానీ దురదృష్టం తీసే వరకూ కొడుతూనే ఉంటుందని మన పెద్దొళ్లు అంటూ ఉంటారు. వచ్చిన అదృష్టాన్ని సక్రమంగా వాడుకుని ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ శిఖరాగ్రాలకు వెళ్లాలి..అలాకాకుండా.. హంగులు, హార్భాటాలకు పోయి డబ్బుని మంచినీళ్లలా ఖర్చుపెడితే శిఖరాగ్రాలు కాదు కదా తిరిగి ఎక్కడ మొదలేశామో అక్కడికే రావాల్సి ఉంటుంది. ఈ విషయం నూరుశాతం నిజమైంది…ఎవరి జీవితంలో అనుకుంటున్నారా..కౌన్ బనేగా కరోడ్ పతి 2011లో విజేతగా నిలిచిన సుశిల్ కుమార్ జీవితంలో.
kaun banega crorepati
బీహార్ కు చెందిన సుశిల్ కుమార్ కేబీసీలో అక్షరాల 5కోట్లు గెలుచుకున్నాడు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఎ‌వరికైనా అంత పెద్ద మొత్తంలో డబ్బు వస్తే ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. జీవితం రంగలమయం అవుతుంది. కానీ సుశిల్ కుమార్ జీవితంలో అలా జరగలేదు. మొట్టమొదటి సారిగా అంతపెద్ద రియాల్టి క్విజ్ షోలో గెలిచిన సుశిల్ చరిత్ర సృష్టించాడు కానీ..తన జీవితాన్ని మాత్రం మార్చుకోలేకపోయాడు.
అసలేం జరిగిందో ఆయనే తన ఫేస్ బుక్ పేజీలో చెప్పుకుని బాధపడ్డాడు. అమితాబ్ చేతులు మీదుగా 5 కోట్ల చెక్క్ తీసుకున్న సుశీల్ ..ఆ తర్వాత నుంచి తన జీవితంలో ఊహించని మలుపులు ఎదుర్కొన్నాడు. ఉన్నంట్టుండిగా అంత డబ్బు వచ్చేసరికి సుశీల్ ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో తెలుసుకునే స్థితిని కోల్పాయాడు. లోకల్ సెలబ్రటీ అయిపోయాడు. ఎక్కడ చూసిన తన పేరే మారు మోగింది. బీహార్ తో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ నెలకు 15 వరకూ ఇంటర్వూలకు హాజరయ్యేవాడనని తనే చెప్పాడు. అలా ఇంటర్వూలకు హాజరవుతూ.. చదువును పక్కన పెట్టేశాడు. మీడియా కూడా సుశీల్ ను బాగా కవర్ చేసేది.. ఎప్పుడు తన ఇంటర్వూ కోసం వెంటపడేదని సుశీల్ చెప్పుకొచ్చాడు. జర్నలిస్టులు తన ఇంటర్వూ తీసుకుని చాలా బాగా రాసేవారట. అయితే ఇక్కడే సుశీల్ ఒక పొరపాటు చేశాడు. సుశీల్ ఒక సామాన్య వ్యక్తి..మీడియాతో ఎలా మాట్లాడాలో, ఎంత వరకు మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎలా బయటకువస్తుంది అనేవి ఏవి తనకు పెద్దగా అవగాహన లేదు. దాంతో వాళ్లు అడిగినదానికి ఏదేదో సమాధానం చెప్పేవాడు. కొన్నిరోజలకు కథ క్లైమాక్స్ కి వచ్చింది.

స్వచ్చంద సంస్థల పేరిట టోకరా

kaun banega crorepati2.jpg

డబ్బున్న వారినే టార్గెట్ చేస్తుంటాయి కొన్ని స్వచ్చంద సంస్థలు..ఎంతోకొంత ఇచ్చే వరకు వదిలిపెట్టరు. అలాగే సుశీల్ కుమార్ వెంట కూడా స్వచ్ఛంద సంస్థలు పడ్డాయి. ముందు వెనక చూడకుండా మనోడు దానధర్మాలు చేయటం మొదలుపెట్టాడు. పక్కన భార్య వద్దని మొరపెట్టుకుంటూనే ఉంది. కానీ డబ్బుందన్న అహంకారం భార్యమాటను పెడచెవిన పెట్టేలా చేసింది. దాంతో భార్యభర్తల మధ్య విభేదాలు కూడా వచ్చాయి. దానవీరసూరకర్ణ రేంజ్ లో సుశీల్ దానాలు చేశాడు.. రహస్యంగా కూడా దానాలు చేయటం తనకు ఒక వ్యసనంగా మారిందని తనే చెప్పాడు. దీన్ని అవకాశంగా వాడుకుని కొందరు తనను మోసం చేసినట్లు తనకు తరువాత తెలిసిందట.

భార్య ఎక్జిట్..మందు, సిగిరెట్ ఎంట్రీ

చెప్పిన మాట వినకపోవటంతో సుశీల్ భార్యతో సుశీల్ కు తరుచూ బాగా గొడవలు జరిగేవి..దాంతో భార్య దూరమైంది. ఇదే సమయంలో సుశీల్ మద్యం, సిగిరెట్ కు అలవాటుపడ్డాడు. ఇంతేకాదు..ఢిల్లీ వెళ్లినప్పుడు రకరకాల వ్యక్తులతో ఏర్పడిన పరిచయం వారితో కలిసి మద్యం, ధూమపానం చేసేవరకు వచ్చింది. చెడు చెప్పేవాడి మాటలు తేనె కంటే తియ్యంగా ఉంటాయ్ కదా..అలానే అక్కడ ఆ వ్యక్తులు చెప్పే మాటలు సుశీల్ కు బాగా నచ్చేవి. ఆ మాటలకు ప్రభావితమై సుశీల్ మీడియాను తెలికగా తీసుకోవటం ప్రారంభించాడు.

వైరస్ కంటే స్పీడ్ గా స్ప్రెడ్ అయిన చిన్న మాట..ఏంటంటే

kaun-banega-crorepati4

మీడియాను లైట్ తీసుకోవటం ప్రారంభించిన సుశీల్..ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ తన ఇంటర్వూకోసం ఊరికే ఫోన్ చేసి విసిగించటంతో సుశీల్ ఒక్కసారిగా ఫోన్ లో నా డబ్బు అంతా అయిపోయింది, కేవలం రెండు ఆవులు మాత్రమే ఉన్నాయని చెప్పాడట. ఈ వార్త ఇక వైరస్ కంట్ స్పీడ్ గా జట్ వేగంతో అంతటా వ్యాప్తించింది. ఎక్కడ విన్న సుశీల్ కుమార్ దివాశ తిశాడనే న్యూసే.

కలకోసం ముంభై పయనం

సుశీల్ కు డైరెక్టర్ అవ్వాలని కల ఉండేదట. భార్యతో విభేదాలు రావటంతో సుశీల్ తన కలకోసం ముంభై వెళ్లాడు. తన స్నేహితులతో రోజుల తరబడి ఏవేవో మంతనాలు జరిపేవాడు. రూంలో ఉంటూ రోజంతా సినిమాలు చూశేవాడట. పుస్తకాలు చదివటం, ప్యాకెట్లు ప్యాకెట్లు సిగెరెట్ తాగటం ఇదే తన జీవనశైలిగా మారింది. జైల్లో ఉన్న ఖైదీకీ జ్ఞోనోదయం అయినట్లు సుశీల్ కి ఆ ఒంటరిబతుకు మంచిచెడును నేర్పింది. తన కళ్లు తెరుచుకున్నాయి. తన రాసిన ఒక కథకు ప్రొడెక్షన్ హోస్ వాళ్లు 20వేలు ఇచ్చారు..దాంతో తను ఉండాల్సింది ఈ వృత్తిలో కాదని తెలుసుకున్నాడు.

హ్యాపీ క్లైమాక్స్

kaun-banega-crorepati

మనసుకు నచ్చిన పనిచేయటంలోనే నిజమైన సంతోషం ఉందని సుశీల్ అర్థంచేసుకున్నాడు. ఊరికి తిరిగి వచ్చి టీచర్ ఉద్యోగానికి కసరత్తు మొదలుపెట్టాడు. అనుకన్నట్లుగానే… టీచర్ జాబ్ సాధించాడు. మందు, సిగిరెట్ మానేశాడు..టీచర్ ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబంతో సంతోషంగా ఉన్నట్లు సుశీల్ చెప్పాడు.
సుశీల్ జీవితంలో ఒకరకంగా ఓడిపోయాడు..తన జీవితం ఎంతోమందికి ఆదర్శంగా మారింది. సొమ్ములు వచ్చినప్పుడే మనిషి తన వివేకాన్ని కోల్పోకుండా ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. జీవితంలో ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు సహజం. సుశీల్ తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఎల్లప్పుడు తన మేలు కోరుకునే భార్య చెప్పే మాటలు వినకుండా తనకు దూరమయి..అర్థంలేని పనులు చేయటం. మనిషికి తను చేసేది తప్పో ఒప్పో చెప్పటానికి ఎప్పుడూ పక్కన ఒక బంధం తోడుగా ఉండాలి…లేదా తనే ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. సుశీల్ కుమార్ మంచి చెప్పే భార్యను వదిలేశాడు, ఆలోచనను మానేశాడు. కష్టం వచ్చినప్పుడే మనోళ్లు ఎవరో బయటవ్యక్తులు ఎ‌వరో తెలుస్తుంది..అంతబాగున్నంత వరుకూ అందరూ ఆత్మీయుల్లాగానే ఉంటారు. ఈ విషయాన్ని అందరు తెలుసుకోవటం చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news