ఎడిట్ నోట్: కేసీఆర్ పాలి’ట్రిక్స్’!

-

మొత్తానికి కేంద్రంలో అధికారంలో బీజేపీని టార్గెట్‌గా చేసుకుని కేసీఆర్ దూకుడుగానే రాజకీయం చేస్తున్నారు…ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ బలపడుతూ వస్తుందో..బీజేపీ నేతలు కేసీఆర్ సర్కార్‌ని టార్గెట్ చేసి దూకుడుగా వెళుతున్నారో…అప్పటినుంచి కేసీఆర్ రాజకీయంలో మార్పు వచ్చింది. అప్పటివరకు కేంద్రంలో బీజేపీకి కూన్నిసార్లు మద్ధతు పలికిన కేసీఆర్…ఒక్కసారిగా రివర్స్ అయిపోయారు..మరి బీజేపీ వల్ల తమకే ప్రమాదమని గ్రహించారో లేక..నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ఎవరోకరిని బూచిగా చూపించాలి కాబట్టి…బీజేపీని టార్గెట్ చేశారో తెలియదు గాని..మొత్తానికి బీజేపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయం నడిపిస్తున్నారు.

ఇక ఈ మధ్య ఏ సభ పెట్టిన, ప్రెస్ మీట్ పెట్టినా సరే…బీజేపీని విమర్శించడమే..అసలు మోదీ ప్రభుత్వం వల్ల దేశం నాశనమైపోతుందని మాట్లాడుతున్నారు. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష నేతలని ఏకతాటిపైకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలని కలిసిన కేసీఆర్…తాజాగా బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ సీఎం అయిన నితీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఇక అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి…మోదీపై ఫైర్ అయ్యారు.

అయితే తనని తాను కాపాడుకునేందుకే కేసీఆర్ విపక్ష నేతల మద్ధతు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో మరణించిన సైనిక కుటుంబాలకు, రైతు కుటుంబాలకు కేసీఆర్ సాయం చేస్తున్నారు.

ఇలా దేశాన్ని కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలబడటం తప్పు కాదు…కానీ సొంత రాష్ట్రంలో ఉన్న రైతులని ఆదుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక మోదీ సర్కార్‌పై వార్ ప్రకటించిన కేసీఆర్…గతంలో చంద్రబాబు ఏ విధంగా అయితే…బీజేపీ టార్గెట్‌గా రాజకీయం నడిపారో సేమ్ అలాగే ఇప్పుడు కేసీఆర్ సైతం రాజకీయం చేస్తున్నారు. తాజాగా మరోసారి బాబుని ఫాలో అవుతూ…తెలంగాణలో సీబీఐ ఎంట్రీకి బ్రేక్ వేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…2018లో బీజేపీ నుంచి బయటకొచ్చేశారు..ఆ తర్వాత మోదీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా మోదీని టార్గెట్ చేశారు…అలాగే దేశంలో విపక్ష నేతలని కలిసి…ఏకతాటిపైకి తీసుకోచ్చేందుకు ప్రయత్నించారు..ఇక కాంగ్రెస్‌ని కూడా కలిశారు. అయితే కేంద్రం..తమపై ఈడీ, సీబీఐ దాడులు చేయకుండా…అడ్డుకునేందుకు..రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ ఇచ్చేందుకు అనుమతి నిరాకరించారు.

అప్పుడు బాబు ఏదైతే చేశారో…ఇప్పుడు సేమ్ కేసీఆర్ అదే చేస్తున్నారు. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ తమ రాష్ట్రాల్లో కూడా దర్యాప్తులు కొనసాగించడానికి వీలుగా ఇచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అంటే త్వరలోనే తెలంగాణలో సీబీఐ ఎంట్రీకి కేసీఆర్ సమ్మతిని ఉపసంహరించుకోనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే ముందుకెళ్లనున్నారు. సరే సీబీఐ సంగతి పక్కన పెడితే… పోలీసింగ్ అనేది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని వ్యవహారం అని కేసీఆర్ అంటున్నారు.

అంటే రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థని వాడుకుంటూ ప్రతిపక్షాలని అణిచివేయొచ్చు అనేది కేసీఆర్ చెప్పదలుచుకున్నారా? అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలకు పోలీసుల ద్వారా ఎలా బ్రేకులు వేస్తున్నారో తెలిసిందే. అంటే ఇక్కడ కేసీఆర్ రాజకీయ జిమ్మిక్కులు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news