విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు పేరును విజయవాడ లోక్ సభ నియోజకవర్గాన్ని కొత్త జిల్లాగా ప్రకటిస్తూ, ఆ జిల్లా పేరును ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా నిర్ణయించారు.నిర్థారించారు.దీంతో జగన్ వర్గం తెలుగు తమ్ముళ్ల దగ్గర మంచి మార్కులే కొట్టేశారు.వాస్తవానికి పాదయాత్ర సమయంలోనే జగన్ నోటి వెంట ఎన్టీఆర్ జిల్లా అంటూ కృష్ణా జిల్లాను ప్రకటిస్తామన్న మాట వినవచ్చింది.కానీ ఎందుకనో ఆయన ఆ రోజు జిల్లాల పునర్విభజన ఊసెత్తలేదు.తరువాత అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పేరును పెద్దగా స్మరించలేదు.ఆయన జీవన సహచరి లక్ష్మీపార్వతిని మాత్రం తెలుగు అకాడమీ చైర్మన్ ను చేశారు.
చంద్రబాబుపై ఎప్పటికప్పుడు తిరుగుబాటు ధోరణిలో మాట్లాడుతుంటారు కనుక ఎల్పీకి ఆ అవకాశం దక్కిందన్నది సుస్పష్టం.ఆవిధంగా ఎన్టీఆర్ పై పేటెంట్ తనదే అని ప్రతిసారీ వీలున్న చోట లేదా వీలు దక్కిన చోట మాట్లాడే ఎల్పీని పార్టీలో చేర్చుకోవడం,ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం అన్నవి కేవలం రాజకీయ పరంగానే కాదు సామాజిక పరంగానూ ముఖ్యంగా నందమూరి కుటుంబ పరంగానూ ఓ విధంగా వైసీపీ ఇస్తున్న కౌంటర్ ఎటాక్.అంతేకాదు ఆ మధ్య సాక్షిలో ఎల్పీతో చంద్రబాబుకు వ్యతిరేకంగా కొన్నిప్రకటనలు కూడా ఇప్పించారు.ఇవన్నీజగన్ రాజకీయ ఎదుగుదలకు కారణం అయ్యాయి.దీంతో ఇప్పుడా రుణాన్ని జగన్ తీర్చుకున్నారు అని కూడా అనుకోవచ్చు.
ఇక సుదీర్ఘ కాలంగా ఎన్టీఆర్ పేరును కృష్ణాజిల్లాకు పెట్టాలని ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఆ మాట నెరవేర్చినందుకు అయినా బాలయ్య కానీ పురంధరి కానీ ఎవ్వరూ ప్రెస్ ముందుకు వచ్చి జగన్ కు కృతజ్ఞత చెప్పలేదు. చెల్లించలేదు. కనీసం ట్విటర్ వేదికగా కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదు బాలయ్య. దీనిపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.అదేవిధంగా తారక్ కానీ లోకేశ్ కానీ ఇంకా ఎవ్వరూ మీడియా ముందుకు రాలేదు. ఆ మాటకు వస్తే ఎల్పీ తరఫున కూడా ఇప్పటిదాకా స్టేట్మెంట్ లేనేలేదు.అంటే ఎన్టీఆర్ అన్న వ్యక్తి ఓటు బ్యాంకు రాజకీయాలకే పనికి వస్తారన్న మాట. అంతేకానీ వాటికి అతీతంగా ఆయనను మనం పరిగణించడం లేదు అన్నది నిజం.ఇంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు.ఇదే విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.