పవన్ – బీజేపీ పొత్తు పొడిచినట్టే…మధ్యవర్తిగా..???

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఎంత గొంతు చించుకుని క్లారిటీ ఇచ్చినా. పూర్తిగా పొత్తు లేదనే మాట మాత్రం మాట్లాడటం లేదు. భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డి లాంటి ప్రజా నాయకుడిని ఎదుర్కోవాలంటే జనసేనకి ఉన్న బలం ఏ మాత్రం సరిపోదని చెడ్డీలు వేసుకున్న బుడ్డోడికి కూడా తెలుసు. మరి పవన్ కళ్యాణ్ కి తెలియదా,  చుట్టూ ఉన్న కోటరీకి తెలియదా.. కానీ

పై పైకి మాత్రం పొత్తు సమస్య లేదు అంటూ చెప్పడం అందరిని ఆలోచింప చేస్తోంది. అసలు పోత్తు పెట్టుకుంటే ఏమవుతుంది. గతంలో తన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా బహిరంగంగానే బీజేపీ, టీడీపీ లకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈరోజు పొత్తు అనేది తన నర నరాలలో లేదని చెప్పడం హాస్యాస్పదమనే చెప్పాలి. ప్రస్తుతానికే ఏపీలో వైసీపీ భారీ స్థాయిలో బలమైన పార్టీగా మారింది. మర్రి చెట్టు పాతుకుపోయినట్టుగా ఏపీలో మరింతగా పాతుకుపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరి అలాంటి వైసీపీని ఎదుర్కోవడం కేవలం జనసేన పార్టీ సాధ్యమయ్యే పనేనా అంటే కాదని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ముందు ఒకటి చెప్తున్నారు, కానీ తెరవెనుక మరొకటి జరుగుతోంది అంటూ భవిష్యత్తు రాజకీయాలని విశ్లేషిస్తున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకరం. బీజేపీ మెగా కుటుంభం వైపు ఆశగా చూస్తోందట. మెగా ఫ్యామిలీ ఒకే చెప్తే భవిష్యత్తులో ఏపీ భాద్యతలు వారి భుజాలపైనే పెట్టాలని ఆలోచన చేస్తోందట. ఇప్పటికే అందుకు అనుగుణంగా సంకేతాలు పంపినట్టుగా తెలుస్తోందని అంటున్నారు.

జనసేనపై ఏపీలో సానుభూతి ఉంది. ఎందుకంటే గడిచిన ఎన్నికలలో కేవలం ఒక్క సీటు మాత్రమే ఇచ్చిన ఏపీ ప్రజలు, పవన్ ని రెండు స్థానాలలో ఓడించారు. పవన్ లాంటి నిజాయితీ గల వ్యక్తులని ఓడించడంతో అందరూ జనసేన పార్టీ పై సానుబూతి వ్యక్తం చేస్తున్నారట. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ సానుభూతి అధికారంలో కూర్చో పెట్టాలా ఉండదు కానీ సీట్ల లెక్క మాత్రం సంతృప్తికరంగా పెరుగుతుందని అంటున్నారు.

ఈ క్రమంలోనే మెల్ల మెల్లగా ఎపీల్లోకి తమ విధానాలు ద్వారా చొచ్చుకు వస్తున్న బీజేపీ మోడీ ఫేమ్ తో దూసుకు పోవాలని చూస్తోంది. అయితే ఎంత మోడీ ఫేమ్ ఉన్నా సరే ఏపీలో జగన్ కి దీటుగా నిలబడాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకే జనసేన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు తెరవెనుక జోరుగానే సాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు చిరజీవితో కొందరు బీజేపీ పెద్దలు కూడా భేటీ అయ్యారని, భవిష్యత్తులో బీజేపీ భాద్యతలు మెగా కుటుంభానికే అప్పగిస్తామని హామీ ఇచ్చారనే వార్తలు రాజకీయ వర్గాలలో హల్చల్ చేస్తున్నాయి. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ నేను పొత్తు ఎవరితో పెట్టుకోను ఒక వేళ పెట్టుకునే అందరికి చెప్పి ముందుకు వెళ్తా అంటూ వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఇదే అంటున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో బీజేపీ, మెగా ఫ్యామిలీ కలిసి భారీ స్థాయిలో ఏపీలో బలపడటానికి వ్యూహాలు రచిస్తున్నట్టుగా ఉన్నదని విశ్లేషకుల అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news