టీడీపీలో భారీ సంక్షోభం.. పార్టీ భూస్థాపితమేనా? పగ్గాలు మారాల్సిందేనా?

-

ప్రస్తుతం టీడీపీ ఎదుర్కొంటున్న భారీ సంక్షోభం సాధారణమైనది కాదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 23. ఎంపీల సంఖ్య 3. ఎక్కడి 175 స్థానాలు.. ఎక్కడి 23.

టీడీపీ.. పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆనాడు నందమూరి తారకరామారావు ఏ లక్ష్యంతోనైతే పార్టీని పెట్టారో.. నేడు ఆ లక్ష్యం దిశగా పార్టీ నడవడం లేదు. పార్టీ భ్రష్టుపట్టిపోయింది. ఎప్పుడైతే పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిందో.. అంతే పార్టీ పతనం అప్పటి నుంచే ప్రారంభం అయింది. చివరకు ఇదిగో ఇలా తయారైంది. ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఇటువంటి గతి పడుతుందని బహుశా.. ఎన్టీఆర్ కూడా ఊహించి ఉండరు. ఆయన కళ్ల ముందే ఎన్నో ఘోరాలు జరిగినా చూస్తూ ఊరుకోవడం తప్పించి ఏమీ చేయలేకపోయారు.

ప్రస్తుతం టీడీపీ ఎదుర్కొంటున్న భారీ సంక్షోభం సాధారణమైనది కాదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 23. ఎంపీల సంఖ్య 3. ఎక్కడి 175 స్థానాలు.. ఎక్కడి 23. ఓ చిన్న పార్టీకి వచ్చినన్ని సీట్లు వచ్చాయి. ఏదో అటూ ఇటూగా ప్రతిపక్ష హోదాను సాధించింది కానీ.. పార్టీకి ఇటువంటి గతి పట్టడం ఏంటి. అంటే.. చంద్రబాబు పాలననే కాదు.. అసలు టీడీపీ నాయకుడిగా చంద్రబాబు వద్దు.. అని బేషరతుగా ఏపీ ప్రజలు చెప్పేశారు.

ఏపీ ప్రజలే కాదు.. టీడీపీ నాయకులు కూడా టీడీపీ సంక్షోభాన్ని తట్టుకోలేక మరో దారి చూసుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. మరో 16 మంది ఎమ్మెల్యేలు త్వరలో బీజేపీలో చేరుతున్నారు. ఇంకొందరు ఎంపీలు కూడా బీజేపీలో చేరే యోచనలో ఉన్నారు. ఇక టీడీపీకి మిగిలేదేంటి. గంటా లాంటి ముఖ్య నేతలు కూడా టీడీపీని వీడితే ఇంకేముంది. టీడీపీకి ఉన్న ఆయపు పట్టు ఏంటి. ఇది ఇలాగే కొనసాగితే టీడీపీలో మిగిలేది ఇద్దరే ఇద్దరు నాయకులు. ఒకరు చంద్రబాబు.. ఇంకొకరు ఆయన పుత్రరత్నం లోకేశ్ బాబు.

పగ్గాలు మారాల్సిందే?

ప్రస్తుత తరుణంలో టీడీపీ పరిస్థితి మారాలంటే.. టీడీపీకి మునపటి వైభవం రావాలంటే ఖచ్చితంగా పార్టీ పగ్గాలు మారాల్సిందే. పార్టీ నాయకుడు మారాల్సిందే. నాయకుడు మారాల్సిందే అనగానే.. ఆయన కొడుకు లోకేశ్ బాబుకు పగ్గాలు అప్పజెప్పాలని కాదు. ఆయనకు అప్పజెప్పితే.. ఈమాత్రం కూడా ఉండదు. వరదలో కొట్టుకుపోతుంది పార్టీ.

ఖచ్చితంగా పార్టీ.. నందమూరి వారసల్లో అసలు సిసలైన వ్యక్తికి చేరాల్సిందే. నందమూరి వారసుల్లో ఉన్న అసలు సిసలు వ్యక్తుల్లో నిఖార్సయిన వ్యక్తి అంటే జూనియర్ ఎన్టీఆరే. అందుకే.. పార్టీని జూనియర్ కు అప్పగిస్తే మాత్రం ఖచ్చితంగా మళ్లీ పుంజుకుంటుంది. పార్టీకి పూర్వ వైభవం వస్తుంది.

చంద్రబాబు.. ఇక చాలు

చంద్రబాబు.. ఇక చాలు. నువ్వు ఇన్నేళ్లు పార్టీని పీల్చుకుతిన్నది చాలు. ఇక వదిలేయ్. చూస్తున్నావు కదా. నీ ముందే పార్టీ ఏమై పోతున్నదో. యతి గతి లేకుండా పోతున్నది. నువ్వు ఇంకా టీడీపీని పట్టుకొని వేలాడితే టీడీపీ త్వరలోనే భూస్థాపితం అయిపోవడం ఖాయం. నువ్వు, నీ కొడుకు మాత్రమే పార్టీలో మిగులుతారు.

అందుకే… పగ్గాలు వదిలేయ్. జూనియర్ కు అప్పగించు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. కనీసం పార్టీ అయినా బతుకుతుంది. పైన ఉన్న ఆ మహానుభావుడి ఆత్మ శాంతిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version