నిరుద్యోగుల శుభ‌వార్త : పదోతరగతితో రైల్వేలో లక్ష ఉద్యోగాలు

-

దేశవ్యాప్తంగా 16 రైల్వేజోన్ల పరిధిలో లెవల్-1 పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

  • అసిస్టెంటెంట్ (గతంలో గ్రూప్ డీగా పిలిచేవారు)
  •  దక్షణ మధ్య రైల్వేలో 9328
  •  పదోతరగతి/ఐటీఐ ఉత్తీర్ణత.
  •  18- 33 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
1 lakh jobs in Railways
1 lakh jobs in Railways

మొత్తం ఖాళీల సంఖ్య- 1,03769
పేస్కేల్: 7వ వేతన సంఘం పేమ్యాట్రిక్స్ ప్రకారం లెవల్-1 స్కేల్ ఇస్తారు.
పోస్టు: అసిస్టెంట్, హాస్పిటల్ అసిస్టెంట్, ట్రాక్ మెయిన్‌టేనర్.

దక్షిణ మధ్య రేల్వైలో పోస్టుల ఖాళీల వివరాలు

అసిస్టెంట్ (వర్కషాప్)-624, అసిస్టెంట్ బ్రిడ్జి-163, అసిస్టెంట్ సీ అండ్ డబ్ల్యూ-305, అసిస్టెంట్ డిపో (స్టోర్స్)-105, అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్)-229, అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) -109, అసిస్టెంట్ పాయింట్‌మ్యాన్ -1949, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికం-333, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ-176, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్‌షాప్)-85, అసిస్టెంట్ టీఆర్‌డీ-405, అసిస్టెంట్ వర్క్స్-63, హాస్పిటల్ అసిస్టెంట్-37, గ్రేడ్-4 ట్రాక్ మెయింటేనర్ -4753 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
పదోతరగతి ఉత్తీర్ణత లేదా ఎన్‌సీవీటీ/ఎస్‌వీటీ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఐటీఐ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 18- 33 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ,ఎక్స్‌సర్వీస్‌మెన్లకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం

– కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్యపరీక్షల ద్వారా చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్:
– బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు. కాలవ్యవధి 90 నిమిషాలు.
– పరీక్షలో జనరల్ సైన్స్-25, మ్యాథ్స్-25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్-20 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
– నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులు కోతవిధిస్తారు.
సీబీటీలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో పీఈటీకి ఎంపికచేస్తారు.

పీఈటీ

– పురుషులు 35 కేజీల బరువుతో 100 మీటర్లు దూరాన్ని 2 నిమిషాల్లో చేరుకోవాలి. మధ్యలో బరువును కింద పెట్టకూడదు. కి.మీ దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లలో పరుగెత్తాలి.
– మహిళలు 20 కిలోల బరువుతో 100 మీటర్ల దూరాన్ని రెండునిమిషాల్లో చేరుకోవాలి. బరువును గమ్యం చేరేవరకు కిందికి దింప కూడదు. కిలోమీటర్ దూరాన్ని ఐదు నిమిషాల 40 సెకండ్లలో పరుగెత్తాలి.
నోట్: సీబీటీ వచ్చిన మార్కులు, పీఈటీలో అర్హత సాధించినవారిని 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్యపరీక్షలకు పిలుస్తారు.

బాక్స్ – స్క్రీన్

ముఖ్యతేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 12
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఏప్రిల్ 23
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ: సెప్టెంబర్/అక్టోబర్‌లో ఉంటుంది.

వెబ్‌సైట్: www.scr.indianrailways.gov.in

– కేశవ

ఈ విలువైన స‌మాచారం మీకు ఉప‌యోగం ఉన్నా లేక‌పోయిన‌ మీ మిత్రుల‌కు, బంధువుల‌కు ఏవ‌రికైనా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు ద‌య‌చేసి షేర్ చేయండి

Read more RELATED
Recommended to you

Exit mobile version