లీప్‌ సంవత్సరం గమ్మత్తులు

-

ప్రతి నాలుగు లీప్‌ సంవత్సరాలకొకసారి వచ్చే లీప్‌ ఇయర్‌లలో చాలా విచిత్రమైన విషయాలు జరిగాయి. మచ్చుకు కొన్ని..

లీప్‌ సంవత్సరం  పుట్టినప్పుడే విచిత్రాలు మొదలయ్యాయి. రోమన్‌ పాలకుడు జూలియస్‌ సీజర్‌ దీన్ని మొట్టమొదటిసారి దీన్ని అమలు చేసాడు. ఆయన స్మారకార్థం ఆ క్యాలెండర్‌ను జూలియన్‌ క్యాలెండర్‌ అంటారు. అలాగే ఒక నెలకు కూడా ఆయన పేరుమీద ‘జులై’ అని పేరు పెట్టారు.

  • జూలియస్‌ సీజర్‌ కొడుకు అగస్టస్‌ సీజర్‌. జూలియస్‌ సీజర్‌ హయాంలో ఫిబ్రవరినెలలో 30 రోజులుండేవి. అలాగే జులై నెలకు 31, అగస్టుకు మాత్రం 29 రోజులే. ఇది నచ్చని అగస్టస్‌ తను అధికారం చేపట్టగానే అగస్టును 31రోజలుగా చేసి ఫిబ్రవరిని 29రోజులుగా మార్చాడు. అన్నట్లు వాళ్ క్యాలెండర్‌లో ఫిబ్రవరే ఆఖరి నెల.
  • ఫిబ్రవరి 29న పుట్టిన పిల్లలను ‘లీప్లింగ్స్‌’ లేదా ‘లీపర్స్‌’ అని పిలుస్తారు.
  • ఈ ప్రపంచంలో దాదాపు 50 లక్షల మంది లీపర్స్‌ ఉన్నారని ఓ అంచనా.
  • సాధారణంగా పాశ్చాత్యదేశాలలో ఫిబ్రవరి 29ని అమ్మాయిలు ప్రపోజ్‌ చేయడానికి ఉపయోగిస్తారట.
  • లీప్‌ లీప్‌ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం చెడుగా భావిస్తారట గ్రీస్‌లో. అందుకే ఐదింటిలో ఒక జంట ఒక ఏడాదిపాటు తమ పెళ్లిని వాయిదా వేస్తారట.
  • ఆ రోజున పుట్టిన పిల్లలు అసాధారణ ప్రజ్ఞావంతులవుతారని జ్యోతిష్యులు భావిస్తారు.
  • తెలిసున్నంతవరకు ఆదేరోజున పుట్టి, అదేరోజున మరణించింది, టాస్మానియా ముఖ్యుడు జేమ్స్‌ విల్సన్‌.
  • కెరిన్‌ హన్రిక్సన్‌ అనే నార్వే మహిళ, తన ముగ్గురు పిల్లలను లీప్‌ రోజునే కన్నది. 1960, 1964, 1968 సంవత్సరాలలో ఫిబ్రవరి 29న వరుసగా ఆడ, మగ, మగ పిల్లలకు జన్మనిచ్చింది.
  • మీకు తెలుసా?… లీప్‌ సంవత్సరానికి గుర్తు ‘కప్ప’. చాలా దూరం కూడా గెంతుతుంది కాబట్టి.

Read more RELATED
Recommended to you

Latest news