గుడ్ న్యూస్: 10,676 బ్యాంక్ జాబ్స్.. ఖాళీల వివరాలివే…!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,676 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు.

 

ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలని చూస్తే.. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఐబీపీఎస్. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు

డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 జూన్ 28 లోగా అప్లై చేయాలి. మరిన్ని వివరాలు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో చూడచ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే..

మొత్తం 10,676 ఖాళీలు వున్నాయి. ఖాళీల్లో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)- 5305, ఆఫీసర్ స్కేల్ 1- 4119, ఆఫీసర్ స్కేల్ 2 (అగ్రికల్చర్ ఆఫీసర్)- 25, ఆఫీసర్ స్కేల్ 2 (మార్కెటింగ్ ఆఫీసర్)- 43, ఆఫీసర్ స్కేల్ 2 (ట్రెజరీ మేనేజర్)- 9 . అదే విధంగా ఆఫీసర్ స్కేల్ 2 (లా)- 27, ఆఫీసర్ స్కేల్ 2 (సీఏ)- 32, ఆఫీసర్ స్కేల్ 2 (ఐటీ)- 59, ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)- 906, ఆఫీసర్ స్కేల్ 3 – 151 పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు చూస్తే గుంటూరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఖాళీలు వున్నాయి. ఇక తెలంగాణ లో చూస్తే.. వరంగల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్- 225, ఆఫీసర్ స్కేల్ 1- 50, ఆఫీసర్ స్కేల్ 2- 10 పోస్టులున్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా కొన్ని ఖాళీలు వున్నాయి.